

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన తదుపరి సినిమాపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ తర్వాత ‘యానిమల్ పార్క్’ చిత్రాన్ని రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘యానిమల్’కు సీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. దీంతో రణ్‌బీర్ కపూర్ అభిమానుల్లో మరోసారి ఆసక్తి పెరిగింది.
‘యానిమల్’లో రణ్‌బీర్ పోషించిన రణ్‌విజయ్ సింగ్ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు సీక్వెల్‌లో రణ్‌విజయ్‌తో పాటు అజీజ్ పాత్ర కూడా కీలకంగా ఉండనుందని సమాచారం. రణ్‌బీర్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణ కథలో ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశముంది. అయితే పూర్తి నటీనటుల వివరాలు, షూటింగ్ షెడ్యూల్, విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ‘స్పిరిట్’లో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌లతో వంగా సినిమాలు చేయనున్నారనే ప్రచారం ఉన్నప్పటికీ, ఆ ప్రాజెక్టులపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!