
జనరల్

అర్జున్ దాస్, శాండీ మాస్టర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'సూపర్ హీరో బాబు' చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సూపర్ హీరో అవతారంలో అర్జున్ దాస్ కనిపిస్తుండగా, అతని చుట్టూ ఆశ్చర్యంగా చూస్తున్న పాత్రలతో రూపొందించిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జాతీయ అవార్డు గ్రహీత నిర్మాత కె.ఎస్. సినిష్ 'సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ' బ్యానర్‌పై సమర్పిస్తుండగా, రెడాక్టెడ్ స్టూడియోస్‌కు చెందిన శంజన్ జి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తేజు అశ్విని హీరోయిన్గా నటిస్తుండగా, విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!