

‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో బీనా త్రిపాఠి పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి రసిక దుగల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న అనుభవాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెరీర్‌లో కొన్ని సందర్భాల్లో నటుడి ప్రతిభ కంటే వ్యాపారపరమైన అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఎంతటి కళాత్మక ప్రతిభ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అది అవకాశాలను దక్కించుకోవడానికి సరిపోకపోవచ్చని తెలిపారు. ఒక నటుడి పని, అనుభవం పెరుగుతున్న కొద్దీ ప్రేక్షకులు, దర్శకనిర్మాతల్లో అతడిపై నమ్మకం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
అయితే, ఒక నటుడు తాము అనుకున్న పాత్రకు, ప్రాజెక్ట్‌కు సరిపోతాడని మేకర్స్ భావించినప్పుడే తుది కాస్టింగ్ జరుగుతుందని రసిక దుగల్ వివరించారు. పాత్రకు సరిపోరని భావిస్తే ఎంతటి ప్రతిభావంతులైన నటీనటులకైనా అవకాశం దక్కకపోవచ్చని చెప్పారు. మంచి గుర్తింపు, పాపులారిటీ ఉన్నప్పటికీ కొందరు నటీనటులు మంచి అవకాశాలను కోల్పోతుండటం చూస్తే బాధగా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో కాస్టింగ్ వెనుక ఉన్న వాస్తవాలను రసిక దుగల్ వెల్లడించడంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!