
క్రీడలు

‘కోర్టు’ చిత్రంతో గుర్తింపు పొందిన హర్ష రోషన్ మరో ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తెల్లకాగితం’ చిత్రాన్ని శ్రీదేవి ప్రజెన్స్, అరుణాచల క్రియేషన్స్ సంస్థలపై కొమ్మలపాటి కృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో నక్షత్ర కథానాయికగా నటిస్తోంది.
తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తైనట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భావోద్వేగాలతో నిండిన ఈ ప్రేమకథ ప్రేక్షకులకు మధురమైన అనుభూతిని అందిస్తుందని నిర్మాతలు తెలిపారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!