

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ భారత బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన వారం రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన ఈ చిత్రం మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. నోలన్ చిత్రాలకు భారతదేశంలో ఉన్న ఆదరణను మరోసారి ఈ సినిమా నిరూపించింది. మొదటి వారం నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రావడంతో వసూళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ఏడో రోజు 6.15 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ చిత్రం దేశీయంగా మొత్తం 90.30 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది. గ్రాస్ వసూళ్లు 107.72 కోట్లను దాటడంతో భారత్‌లో 100 కోట్ల క్లబ్‌లో చేరిన నోలన్ రెండో చిత్రంగా నిలిచింది. అలాగే టెనెట్, ఓపెన్‌హైమర్, ఇంటర్‌స్టెల్లార్ చిత్రాల ప్రారంభ వసూళ్లను అధిగమించి భారత్‌లో అత్యధిక ఆరంభ వసూళ్లు సాధించిన నోలన్ చిత్రంగా కొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 332 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం వీకెండ్‌లో మరింత వేగంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!