
సినిమాలు

ప్రముఖ నటి త్రిష ‘జన నాయకన్’ సినిమాను చూడటానికి రోహిణి థియేటర్ కు వెళ్లారు. ఉదయం 9 గంటలకు సినిమా ప్రదర్శించగా, త్రిష జీన్స్ ప్యాంటు, టీషర్ట్, నల్ల కళ్లజోడుతో ఉదయం 11 గంటల సమయంలో థియేటర్‌కు చేరుకున్నారు. ఆమె రాకతో అక్కడ సందడి నెలకొంది.
త్రిషను చూసిన వెంటనే అభిమానులు సెల్ఫీల కోసం పోటీపడడంతో కొద్దిసేపు హడావుడి ఏర్పడింది. అక్కడ భద్రతగా ఉన్న మధురవాయల్ పోలీసులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా థియేటర్‌లోకి తీసుకెళ్లారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!