

‘పోలీస్ కంప్లైంట్’ సినిమా ప్రమోషన్ల విషయంలో తనకు సహకరించడం లేదంటూ దర్శకుడు సంజీవ్ మేగోటి చేసిన ఆరోపణలపై నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ స్పందించారు. సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరుకావడం లేదని, భారీ పారితోషికం తీసుకున్నప్పటికీ ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నారని దర్శకుడు ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ వివాదంపై స్పందించిన వరలక్ష్మీ, తనను ఎప్పుడు పిలిచినా అవసరమైన కార్యక్రమాలకు హాజరయ్యానని స్పష్టం చేశారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు చేసిన వ్యాఖ్యల గురించి పూర్తిగా తెలియదని, పూర్తి సమాచారం లేకుండా స్పందించడం సరికాదని పేర్కొన్నారు. అలాగే ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన మరో పోస్ట్‌లో ‘కొన్ని కుక్కలు అరుస్తాయి కానీ కరవవు. నేను అరవను.. కానీ కరుస్తా’ అంటూ పరోక్షంగా దర్శకుడికి కౌంటర్ ఇచ్చినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!