

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి సినిమాలు సుదీర్ఘకాలం పాటు తెరకెక్కుతాయనే అభిప్రాయం సినీ పరిశ్రమలో బలంగా ఉంది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి భారీ చిత్రాలకు ఎక్కువ సమయం తీసుకున్న జక్కన్న.. ఈసారి మాత్రం వారణాసి విషయంలో తన ట్రేడ్‌మార్క్‌కు భిన్నంగా వేగంగా ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌ను 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. అయితే రాజమౌళి గత చిత్రాల షూటింగ్ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అభిమానుల్లో రిలీజ్ డేట్‌పై కొంత సందేహం ఉంది.
ఇటీవల వారణాసి షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయిందని రాజమౌళి స్వయంగా వెల్లడించడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ 1000 రోజులకు పైగా కొనసాగగా.. వారణాసి మాత్రం దానికంటే తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, ఇతర సాంకేతిక పనులను కూడా వేగంగా పూర్తి చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. మహేశ్ బాబుకు జోడీగా ప్రియాంక చోప్రా జోనస్ నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!