

టాలీవుడ్ హీరో గోపీచంద్ తమిళ సినిమాలో ప్రతినాయకుడిగా నటించనున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తాజాగా ఆయన బృందం స్పందించింది. తమిళ సినిమాలో గోపీచంద్ నటిస్తున్నారంటూ వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరింది. గోపీచంద్ తదుపరి సినిమాలకు సంబంధించిన అధికారిక వివరాలను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే వెల్లడిస్తామని ఆయన టీమ్ పేర్కొంది.
ఇక ప్రస్తుతం గోపీచంద్ ‘భరత వర్ష’ సినిమాలో నటిస్తున్నారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో రీతూ వర్మ కథానాయికగా నటిస్తుండగా.. వినోద్ కుమార్, గవీ చాహల్, తనికెళ్ల భరణి, రాకేష్ వర్రే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటిస్తున్నారనే ప్రచారానికి ఆయన బృందం ప్రకటనతో తెరపడింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!