

వెంకటేశ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుటుంబ కథా చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో చిట్టిబాబు అనే కుటుంబ పెద్దగా వెంకటేశ్ నటిస్తున్నారు. ప్రేమ, ఆప్యాయత, బాధ్యతలతో కుటుంబాన్ని ఒకే తాటిపై నడిపించే వ్యక్తిగా ఆయన పాత్ర కనిపించనుంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, నారా రోహిత్, రఘుబాబు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిట్టిబాబు పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. “నాకు ఎవరేం పనిచేసినా నచ్చదు... అన్నీ నేనే చూసుకుంటాను” అనే డైలాగ్తో వెంకటేశ్ ఉత్సాహంగా కనిపించారు. ఈ పాత్ర ఆయన కెరీర్లో ప్రత్యేకంగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కుటుంబ అనుబంధాలు, ఆనందం, విలువలను ప్రతిబింబించే ఈ చిత్రానికి తమన్ సంగీతం, రవి కె. చంద్రన్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అందిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!