
సినిమాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌పై దాడుల విషయంలో ఎలాంటి విరామం రాలేదని, చర్చలకు అవకాశం ఇవ్వడానికి తాత్కాలికంగా ఆపినట్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు విఫలమైతే మరింత తీవ్ర స్థాయిలో దాడులు తిరిగి ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, చర్చల్లో కొంత సానుకూలత కనిపిస్తోందని మధ్యవర్తులు వెల్లడించారు.
ఇక మరోవైపు, ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల మిలిటెంట్లు సౌదీ అరేబియాపై దాడులను కొనసాగించారు. జోర్డాన్ రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. గత వారాంతం నుంచి అమెరికా, ఇరాన్ నేరుగా దాడులు చేసుకోకపోవడం గమనార్హం. అమెరికా దాడులు ఆపినందునే తాము కూడా ఆపామని ఇరాన్ వెల్లడించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!