Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కేంద్ర మంత్రి పేరుతో సైబర్ నేరగాళ్ల మోసం..

11:05 AM, 27 ఫిబ్రవరి, 2026
కేంద్ర మంత్రి పేరుతో సైబర్ నేరగాళ్ల మోసం..

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాదు, ప్రముఖుల కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా, సీపీఐ దివంగత నేత సురవరం సుధాకర్‌రెడ్డి భార్య బీవీ విజయలక్ష్మి (75) సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కి సుమారు రూ.11 లక్షలు పోగొట్టుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో ఉన్న నకిలీ ప్రకటనను నమ్మి ఆమె ఈ మోసానికి గురయ్యారు.

పోలీసుల కథనం ప్రకారం.. గత ఏడాది డిసెంబర్‌లో విజయలక్ష్మి సోషల్ మీడియాలో ఓ పెట్టుబడి ప్రకటనను చూశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫొటోతో ఉన్న ఆ ప్రకటనలో సెబీ గుర్తింపు పొందిన 'క్వాంటాపల్స్' అనే సంస్థ ద్వారా ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఉంది. అది నిజమని నమ్మిన ఆమె, అందులో ఉన్న లింక్‌పై క్లిక్ చేశారు. వెంటనే ఆమెకు వాట్సాప్‌లో 'ఆదిత్య సుబ్రహ్మణ్యం' అనే వ్యక్తి పరిచయమయ్యాడు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద తొలుత రూ.13 వేలు కట్టించుకున్నాడు.

ఆపై పెట్టుబడి పేరుతో జనవరి 30న రూ.1.99 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత యూకే నుంచి 'ఆడమ్ స్మిత్' అనే మరో వ్యక్తి ఫోన్ చేసి, లాభాలు డాలర్లలో వచ్చాయని నమ్మించాడు. అయితే, లావాదేవీలు రద్దయ్యాయని, ట్యాక్స్ కట్టాలని చెప్పి విడతల వారీగా ఈ నెల 13 వరకు మొత్తం రూ.10.91 లక్షలు కాజేశాడు. పదేపదే డబ్బు అడుగుతుండటంతో అనుమానం వచ్చిన విజయలక్ష్మి, తాను మోసపోయానని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీల ముఖాలతో వచ్చే నకిలీ, డీప్ ఫేక్ వీడియో ప్రకటనలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే స్కీమ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో కనిపించే అపరిచిత లింక్‌లను క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

ట్యాగ్లు
సైబర్ మోసంఆన్‌లైన్ మోసాలునకిలీ ప్రకటనలుడీప్ ఫేక్ వీడియోలుపెట్టుబడి మోసంసోషల్ మీడియా మోసంసైబర్ క్రైమ్ పోలీస్బీవీ విజయలక్ష్మినిర్మలా సీతారామన్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు
ఆరోగ్యం

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ
రాజకీయాలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు
జనరల్

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు
సినిమాలు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల
సినిమాలు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం
జనరల్

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..
రాజకీయాలు

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..
సినిమాలు

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
జనరల్

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!