Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జిల్లాలను రద్దు చేయము- సీఎం రేవంత్ రెడ్డి

08:38 PM, 8 ఫిబ్రవరి, 2026
జిల్లాలను రద్దు చేయము- సీఎం రేవంత్ రెడ్డి

కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్వయంగా స్పష్టతనిచ్చారు. ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచనగానీ ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేస్తారంటూ కొందరు తప్పుడు, విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాంటి ఆలోచనలే ప్రభుత్వం చేయడం లేదని స్పష్టం చేశారు. “ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తూ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, సింగరేణి మెడికల్ బోర్డు అంశాలపై స్పష్టతనిచ్చారు.

“జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ తప్పుడు విష ప్రచారం చేస్తున్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. ఎక్కడైనా జిల్లాల్లో పునర్వ్యవస్థీకరించాలి లేదా రేషనలైజేషన్ చేయాలంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చించి, ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచనలు చేస్తాం. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరెన్ని అపోహలు సృష్టించినా, భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం, కుట్రలు కుతంత్రాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారిని పసిగట్టగలిగే శక్తి భూపాలపల్లి ప్రజలకు ఉంది. భూపాలపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తాం” అని వివరంగా చెప్పారు.

సింగరేణి మెడికల్ బోర్డుకు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. “ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు సింగరేణి పరీవాహక ప్రాంతంలో వేలాది సింగరేణి కార్మిక కుటుంబాలున్నాయి. కార్పొరేట్ మెడికల్ బోర్డును రద్దు చేస్తుందని, వారసత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పోతాయని కొందరు తప్పుడు, విష ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావడం లేదు. సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేయాలన్న ఆలోచనే ప్రభుత్వం చేయడం లేదు. కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేస్తుంది తప్ప, కార్మికులకు నష్టం కలిగే ఏ నిర్ణయం తీసుకోదు. సింగరేణి గని కార్మికులు తమ భుజాలపై మోసి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టారు” అని ముఖ్యమంత్రి గారు విడమరిచి చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ ప్రభుత్వంజిల్లాల రద్దు లేదుతప్పుడు ప్రచారంసీఎం స్పష్టతప్రజాపాలన ప్రగతి బాటభూపాలపల్లి సభసింగరేణి మెడికల్ బోర్డు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు
ఆరోగ్యం

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ
రాజకీయాలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు
జనరల్

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు
సినిమాలు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల
సినిమాలు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం
జనరల్

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..
రాజకీయాలు

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..
సినిమాలు

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
జనరల్

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!