
గాసిప్స్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, యంగ్ హీరోయిన్ శర్వరి ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ చిత్రం ‘ఆల్ఫా’ ఓటీటీలోకి వచ్చేసింది. శివ్ రవైల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుతం ఓటీటీలో హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా నటించగా, హృతిక్ రోషన్ కీలకమైన క్యామియో పాత్రలో కనిపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!