

ఆలియా భట్, శర్వరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు శివ్ రావైల్ తెరకెక్కించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రం, ఈ యూనివర్స్‌లో తొలి మహిళా ప్రధాన కథాంశంతో వచ్చిన సినిమాగా నిలిచింది. అయితే మిగతా స్పై యూనివర్స్ చిత్రాలతో పోలిస్తే ‘ఆల్ఫా’కు బలహీన స్పందన లభించినట్లు సినీ వర్గాల్లో చర్చ జరిగింది.
తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘ఆల్ఫా’ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఆగస్టు 28 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. అయితే పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో సినిమా అందుబాటులోకి వచ్చే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ‘ఆల్ఫా’లో హృతిక్ రోషన్ అతిథి పాత్రలో నటించగా, బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!