
సినిమాలు

ఓటీటీ వేదికలపై మలయాళ సినిమాలకు ప్రత్యేక ఆదరణ కొనసాగుతోంది. విభిన్న కథలు, భావోద్వేగ ప్రధాన కథనాలతో రూపొందే ఈ చిత్రాలు ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ ఏడాది థియేటర్లలో మంచి స్పందన పొందిన ‘చిన్న చిన్న ఆసై’ సినిమా జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ ప్రారంభించింది.
వర్ష వాసుదేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇంద్రన్స్, మధు బాల, అపర్ణ బాలమురళి, జాఫర్ సాదిక్, విష్ణు అగస్త్య ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రావడంతో దేశవ్యాప్తంగా మరింత మంది ప్రేక్షకులు ఈ ఎమోషనల్ డ్రామాను వీక్షించే అవకాశం కలిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!