24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెరైటీ కథతో డబుల్ డోస్ కామెడీ.. ‘డబుల్ ఆక్యుపెన్సీ’ ఎందుకు చూడాలంటే?

Writer: Harika S 05:09 AM, 24 ఆగస్టు, 2026
వెరైటీ కథతో డబుల్ డోస్ కామెడీ.. ‘డబుల్ ఆక్యుపెన్సీ’ ఎందుకు చూడాలంటే?

ప్రతి మనిషికీ ఓ ఆలోచన ఉంటుంది. కానీ ఆ ఆలోచనను ప్రేక్షకులకు కొత్తగా, ఆసక్తికరంగా చెప్పడంలోనే దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. అలాంటి విభిన్నమైన ప్రయత్నమే ‘డబుల్ ఆక్యుపెన్సీ’. సినిమా టైటిల్ నుంచే దర్శకుడు కథలోని ప్రధాన పాయింట్‌ను ఆసక్తికరంగా పరిచయం చేశారు. అశ్విన్ కందసామి రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నటి ఖుష్బూ సుందర్ నిర్మించారు.

ఈ సినిమా కథ రజనీ చుట్టూ తిరుగుతుంది. పుట్టుకతో వచ్చిన ఓ అరుదైన లోపం కారణంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రజనీ ఆడపిల్లగా ఉంటుంది. సాయంత్రం 6 గంటల తర్వాత అదే వ్యక్తి అబ్బాయిగా మారిపోతాడు. ఈ విషయం రజనీ పుట్టినప్పటి నుంచే తల్లిదండ్రులకు తెలియడంతో ఎంతో జాగ్రత్తగా పెంచుతారు. అయితే పగటి రజనీకి రాత్రి రజనీ ఏం చేస్తున్నాడో తెలియదు. అలాగే రాత్రి రజనీకి పగటి రజనీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇద్దరినీ కలిపే ఏకైక బంధం వారు ఉపయోగించే మొబైల్ ఫోన్.

అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో పగటి సమయంలో రజనీ తల్లిదండ్రులు మరణిస్తారు. రాత్రి రజనీకి ఈ విషయం తెలిసిన తర్వాత, తల్లిదండ్రులను చివరిసారి చూసే అవకాశం కూడా తనకు దక్కలేదనే బాధతో పగటి రజనీపై ద్వేషం పెంచుకుంటాడు. అక్కడి నుంచి కథ ఊహించని మలుపులు తిరుగుతుంది.

క్లైమాక్స్‌కు ముందు కొందరు దుండగులు పగటి రజనీని ఓ కారణంతో కిడ్నాప్ చేస్తారు. అయితే వారు ఊహించినట్లుగా రజనీ రాత్రి రూపంలోకి మారడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ ఆసక్తికరమైన మలుపే ‘డబుల్ ఆక్యుపెన్సీ’ క్లైమాక్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

ఇలాంటి కాన్సెప్ట్‌లు గతంలో అప్పుడప్పుడు కనిపించినప్పటికీ, దర్శకుడు అశ్విన్ కందసామి ఈ కథను కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, సస్పెన్స్‌తో ఆసక్తికరంగా మలిచారు. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ తమిళ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది. వెరైటీ కథ, డబుల్ డోస్ కామెడీ, ఊహించని ట్విస్టులతో ‘డబుల్ ఆక్యుపెన్సీ’ మంచి టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ఓటీటీలోకి సడన్‌గా వచ్చిన హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ అందులోనే

ఓటీటీలోకి సడన్‌గా వచ్చిన హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ అందులోనే

ఓటీటీలో ‘బందర్’

ఓటీటీలో ‘బందర్’

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం

‘సంజీవ్’ ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఇదిగో డీటెయిల్స్!

‘సంజీవ్’ ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఇదిగో డీటెయిల్స్!

ట్యాగ్లు
డబుల్ ఆక్యుపెన్సీఅశ్విన్ కందసామిఖుష్బూ సుందర్తమిళ సినిమాఫ్యామిలీ డ్రామాకామెడీ డ్రామాప్రైమ్ వీడియోసినిమా రివ్యూ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కష్టాల్లో కుంభమేళా మోనాలిసా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..
జనరల్

కష్టాల్లో కుంభమేళా మోనాలిసా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..

కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థినుల వివాదం...
జనరల్

కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థినుల వివాదం...

‘రాకా’ విజువల్స్‌పై మంచు లక్ష్మి ప్రశంసలు.. అంచనాలు పెంచిన కామెంట్స్!
సినిమాలు

‘రాకా’ విజువల్స్‌పై మంచు లక్ష్మి ప్రశంసలు.. అంచనాలు పెంచిన కామెంట్స్!

ఏఐసీసీ ప్రెసిడెంట్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ
జనరల్

ఏఐసీసీ ప్రెసిడెంట్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్‌కు క్లారిటీ.. నేటి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్!
సినిమాలు

‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్‌కు క్లారిటీ.. నేటి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్!

బాలయ్య 111 రిలీజ్‌పై కీలక అప్‌డేట్...
గాసిప్స్

బాలయ్య 111 రిలీజ్‌పై కీలక అప్‌డేట్...

బాలయ్య-కొరటాల మూవీపై కీలక అప్‌డేట్ ఇదే!
గాసిప్స్

బాలయ్య-కొరటాల మూవీపై కీలక అప్‌డేట్ ఇదే!

నేటి రాశిఫలాలు: 5 రాశులకు ఆదాయ వృద్ధి, కెరీర్‌లో పురోగతి
జనరల్

నేటి రాశిఫలాలు: 5 రాశులకు ఆదాయ వృద్ధి, కెరీర్‌లో పురోగతి

నేటి పంచాంగం.. తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ సమయాల వివరాలు
జనరల్

నేటి పంచాంగం.. తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ సమయాల వివరాలు

వెరైటీ కథతో డబుల్ డోస్ కామెడీ.. ‘డబుల్ ఆక్యుపెన్సీ’ ఎందుకు చూడాలంటే?
ఓటీటీ

వెరైటీ కథతో డబుల్ డోస్ కామెడీ.. ‘డబుల్ ఆక్యుపెన్సీ’ ఎందుకు చూడాలంటే?

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన
జనరల్

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన

తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి - సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి - సీఎం రేవంత్‌ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!