
సినిమాలు

14 కోట్ల దొంగ ఓట్లు ఉన్నాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పడంలో పీహెచ్డీ చేశారంటూ ఎద్దేవా చేశారు. లోక్సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి 850కి పెంచాలన్న ప్రతిపాదనను ఆయన సమర్థించారు. దేశ జనాభాకు అనుగుణంగా లోక్సభ స్థానాల సంఖ్యను పెంచడం సానుకూల పరిణామమని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీపై కూడా రవిశంకర్ ప్రసాద్ విమర్శలు గుప్పించారు. ఆ పార్టీకి ఎమర్జెన్సీ డీఎన్ఏ ఉందని, విపక్షాల గొంతు నొక్కడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, లోక్సభ స్థానాల పెంపు ప్రతిపాదనపై కొనసాగుతున్న రాజకీయ చర్చల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!