
జనరల్

నటుడు ప్రకాశ్ రాజ్ ప్రశ్న రావణ్‌ను మరోసారి అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఏంటీ ఈ నాటకం.. ఏంటీ ఈ దౌర్జన్యం?” అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ పదేపదే అరెస్ట్ చేయడం సరైంది కాదని అన్నారు. రావణ్‌పై తప్పుడు కేసులు నమోదవుతున్నాయని కోర్టే వ్యాఖ్యానించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
పోలీస్ స్టేషన్ల బయట జనసైనికులు రావణ్‌పై దాడికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ “ఎందుకు ఇంత అహంకారం?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పరోక్ష విమర్శలు చేస్తూ, మీ నాన్నగారి పోలీస్ సేవలను గౌరవించే క్రమంలో అయినా శాఖను కక్ష సాధింపులకు ఉపయోగించవద్దని సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!