
జనరల్

వైఎస్ షర్మిల కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. ఆమె కుమార్తె అంజలి రెడ్డి త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నెల 25న సోమాల రఘురామ్ రెడ్డితో అంజలి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. తాజాగా హల్దీ వేడుకను ఘనంగా నిర్వహించారు.

పసుపు వేడుకకు సంబంధించిన అందమైన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించడంతో పాటు అంజలి రెడ్డి పెళ్లిపై ఆసక్తిని పెంచుతున్నాయి. త్వరలో ఒక్కటి కాబోతున్న అంజలి రెడ్డి, సోమాల రఘురామ్ రెడ్డి జంటకు పలువురు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!