
సినిమాలు

తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌పై పలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ల కింద కేసు నమోదైంది. విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రజా శాంతికి భంగం కలిగించేలా వ్యవహరించడం వంటి ఆరోపణలపై బీఎన్‌ఎస్ సెక్షన్ 196 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.
అల్లర్లకు ప్రేరేపించడం, బహిరంగ ప్రదేశంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, బెదిరింపులు, ఉద్దేశపూర్వక అవమానం, మహిళ గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బీఎన్‌ఎస్‌లోని 192, 296(బి), 351, 352, 79 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడైంది. ఈ ఆరోపణలపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!