
జనరల్

ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు కీలక వివరాలను వెల్లడించాయి. ఈ ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన లోక్‌సభ స్థానాలు కూడా 50 శాతం పెరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. డీలిమిటేషన్ కమిషన్‌కు జ్ఞానేశ్ కుమార్ సారథ్యం వహించబోరని తెలిపింది. కమిషన్‌లో ఒక చైర్మన్‌తో పాటు 12 మంది సభ్యులు ఉంటారని వివరించింది.
ప్రతి రాష్ట్రం నుంచి ఐదుగురు లోక్‌సభ ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు కమిషన్‌లో సభ్యులుగా ఉంటారని కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా సభ్యుడిగా వ్యవహరిస్తారని తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) లేదా ఎన్నికల కమిషనర్ (EC) కమిషన్‌లో కేవలం సభ్యుడిగానే ఉంటారని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనకు 371 మంది లోక్‌సభ ఎంపీల మద్దతు ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!