4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నందన్ నీలేకనితో సీఎం చంద్రబాబు భేటీ.. జాతీయ పరీక్షల విధానంలో మార్పులపై చర్చ

Writer: Harika S 10:33 PM, 4 నవంబర్, 2026
నందన్ నీలేకనితో సీఎం చంద్రబాబు భేటీ.. జాతీయ పరీక్షల విధానంలో మార్పులపై చర్చ

భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, భాషలకు చెందిన విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేలా జాతీయ పరీక్షా విధానంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. నవంబర్ 4న అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ హై పవర్డ్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ నందన్ నీలేకని, ఇతర సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నందన్ నీలేకనికి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఏకాభిప్రాయంతో పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షా విధానాన్ని రూపొందించాలని చంద్రబాబు అన్నారు. విద్యార్థుల నైపుణ్యాలు, సృజనాత్మకత, ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించేలా విద్యా విధానం ఉండాలని సూచించారు.

ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేలా సంస్కరణలు చేపట్టాలని కోరారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లి చదువుకోవడం లేదా ఉద్యోగం చేయడంలో భాష, విద్యా విధానం, ధృవీకరణ పత్రాల పరంగా ఇబ్బందులు లేకుండా జాతీయ స్థాయిలో సమన్వయం అవసరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో డేటా లేక్ ద్వారా వివిధ రంగాల సమాచారాన్ని సమీకరించి నిర్ణయాలు తీసుకుంటున్న విధానాన్ని వివరించారు. మరోవైపు, పరీక్షల్లో పేపర్ లీకేజీలను అరికట్టడం, సాంకేతికత వినియోగం, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్‌ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్లు నందన్ నీలేకని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి విధానాలు, సమస్యలు, సంస్కరణలపై అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల ఘన విజయం.. కాంగ్రెస్‌పై పట్టు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల ఘన విజయం.. కాంగ్రెస్‌పై పట్టు

బీజేపీకి ఓవైసీ కౌంటర్.. ‘నేను బీవీ పగ్లు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీకి ఓవైసీ కౌంటర్.. ‘నేను బీవీ పగ్లు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

పంజాబ్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం షురూ..

పంజాబ్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం షురూ..

అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరిక.. దాడి చేస్తే తీవ్ర పరిణామాలు!

అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరిక.. దాడి చేస్తే తీవ్ర పరిణామాలు!

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు  ఏర్పాట్లు పూర్తి

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

రామ మందిరంపై ఎస్టీ హసన్ వ్యాఖ్యలు.. అఖిలేశ్‌పై బీజేపీ నేత ఫైర్

రామ మందిరంపై ఎస్టీ హసన్ వ్యాఖ్యలు.. అఖిలేశ్‌పై బీజేపీ నేత ఫైర్

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడునందన్ నీలేకనినారా లోకేష్పరీక్షల సంస్కరణలుజాతీయ పరీక్షా విధానంఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
జనరల్

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

నెల్సన్ గ్రాఫ్ చూశారా
సినిమాలు

నెల్సన్ గ్రాఫ్ చూశారా

 చేతులు మారిన 'తెహల్కా డాట్ కామ్'
జనరల్

చేతులు మారిన 'తెహల్కా డాట్ కామ్'

డబ్ల్యూపీఎల్ 2027:  పూర్తి షెడ్యూల్
క్రీడలు

డబ్ల్యూపీఎల్ 2027: పూర్తి షెడ్యూల్

త్వరలో 'భారతీయ వాయుయాన్ నియమ్-2026' ఏళ్ల నాటి చట్టం రద్దు
జనరల్

త్వరలో 'భారతీయ వాయుయాన్ నియమ్-2026' ఏళ్ల నాటి చట్టం రద్దు

నందన్ నీలేకనితో సీఎం చంద్రబాబు భేటీ.. జాతీయ పరీక్షల విధానంలో మార్పులపై చర్చ
రాజకీయాలు

నందన్ నీలేకనితో సీఎం చంద్రబాబు భేటీ.. జాతీయ పరీక్షల విధానంలో మార్పులపై చర్చ

బేతుపల్లి చెరువులో ప్రమాదం.. గల్లంతైన రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్లు
జనరల్

బేతుపల్లి చెరువులో ప్రమాదం.. గల్లంతైన రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్లు

‘రామాయణ’పై దిల్ రాజు తొలి స్పందన..
సినిమాలు

‘రామాయణ’పై దిల్ రాజు తొలి స్పందన..

ఎన్ఆర్ఐల కేవైసీ ప్రక్రియలో మార్పులు.. సెబీ కొత్త రూల్స్
జనరల్

ఎన్ఆర్ఐల కేవైసీ ప్రక్రియలో మార్పులు.. సెబీ కొత్త రూల్స్

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల ఘన విజయం.. కాంగ్రెస్‌పై పట్టు
రాజకీయాలు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల ఘన విజయం.. కాంగ్రెస్‌పై పట్టు

‘దాదా’ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘దాదా’ రిలీజ్ డేట్ ఫిక్స్

నార్నే నితిన్ ఆరోగ్యంపై కిమ్స్ ఆసుపత్రి కీలక ప్రకటన
సినిమాలు

నార్నే నితిన్ ఆరోగ్యంపై కిమ్స్ ఆసుపత్రి కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!