
జనరల్

భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు), విదేశీ పెట్టుబడిదారులకు సెబీ కేవైసీ నిబంధనలను సడలించింది. డిసెంబర్ 3 నుంచి డిజిటల్ ఆన్‌బోర్డింగ్ విధానం అందుబాటులోకి రానుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) నిబంధనలు పాటించే దేశాల్లో నివసించే అర్హులైన పెట్టుబడిదారులు భారత్‌కు ప్రయాణించాల్సిన అవసరం లేకుండానే కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ఈ విధానంలో వీడియో ఇన్-పర్సన్ వెరిఫికేషన్ (VIPV) ద్వారా అవసరమైన పత్రాలను ధృవీకరిస్తారు. దీంతో విదేశాల్లో నివసించే పెట్టుబడిదారులకు ఖాతా ప్రారంభించడం, గుర్తింపు పత్రాల ధృవీకరణ ప్రక్రియ మరింత సులభం కానుంది. ఈ నిర్ణయం ఎన్ఆర్ఐలు, విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న ప్రక్రియాపరమైన ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!