

సిరిసిల్లలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై పలు ఆరోపణలు చేశారు. గత బీఆర్‌ఎస్ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపిస్తూ.. కేటీఆర్ తన కుటుంబ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణతో పాటు విదేశాల్లో ఉన్నాయని తాను ఆరోపిస్తున్న ఆస్తులు, పెట్టుబడుల వివరాలపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
సిరిసిల్ల చేనేత రంగం, కార్మికుల సమస్యలు, గల్ఫ్ దేశాలకు వలసలపైనా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కేటీఆర్ పలుమార్లు సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ చేనేత కార్మికులు, వలస కార్మికుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం చేనేత కార్మికులు, వలస కుటుంబాల కోసం చేపట్టిన చర్యలను వివరించడంతో పాటు సిరిసిల్లలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై అసెంబ్లీలో చర్చకు రావాలని రేవంత్‌రెడ్డి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో సిరిసిల్లలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. కాగా, రేవంత్‌రెడ్డి ఆరోపణలను కేటీఆర్, బీఆర్‌ఎస్ గతంలో ఖండిస్తూ.. భూములు, అభివృద్ధి పనులకు సంబంధించిన ఆరోపణలపై పూర్తి వివరాలు, శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!