

బీహార్‌లో నూతనంగా ప్రారంభమైన ‘నితీశ్ సేతు’ వంతెన రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వంతెనను ప్రారంభించిన కొద్దిసేపటికే ఆర్జేడీ మద్దతుదారులు అక్కడ ఏర్పాటు చేసిన ఆయన పోస్టర్లను చించివేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాఘోపూర్‌ను కలిపే ఈ వంతెన సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వర్గాల మధ్య కొత్త చర్చ మొదలైంది.
కచ్చీ దర్గా-బిదుపూర్ వంతెనకు ‘నితీశ్ సేతు’ అని పేరు పెట్టడంపై ఆర్జేడీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వంతెన నిర్మాణం తమ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని, నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చలేదని ఆర్జేడీ కార్యకర్తలు ఆరోపిస్తూ నినాదాలు చేశారు. మరోవైపు జన సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ ఈ వివాదంపై స్పందించారు. నితీశ్ కుమార్ కృషి వల్లే ఈ వంతెన నిర్మాణం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. దీంతో వంతెన నిర్మాణ ఘనత, పేరుపై బీహార్‌లో రాజకీయ వాగ్వాదం మరింత ముదిరింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!