

తెలంగాణలో విద్యుత్ కోతలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వారికి సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న విద్యుత్ సమస్యలను గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొంటూ, విద్యుత్ అంతరాయాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇతర అంశాలపై ఆరోపణలు చేయడం సరికాదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
మరోవైపు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై వస్తున్న ఆరోపణలపైనా రఘునందన్రావు స్పందించారు. కొండారెడ్డిపల్లిలో ఎన్ని ఓట్లు తొలగించారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. SIR ప్రక్రియలో భాగంగా డూప్లికేట్ ఓట్లు, మరణించిన ఓటర్ల పేర్లను మాత్రమే తొలగించారని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా సమస్యలతో పాటు ఓటర్ల జాబితా సవరణ అంశంపై కూడా ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!