

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ లోక్‌సభ ఎంపీలందరికీ త్రీ లైన్ విప్ జారీ చేసింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 4 వరకు జరిగే కీలక చర్చల సమయంలో ఎంపీలంతా సభకు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ చీఫ్ విప్ రాజ్ కుమార్ చబ్బేవాల్ ఆదేశించారు. పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆప్ ఈ నిర్ణయం తీసుకుంది.
దేశంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రజాప్రతినిధుల సంఖ్య పెంచడంపై ఆప్ ప్రభుత్వాన్ని విమర్శించింది. దేశవ్యాప్తంగా సుమారు 11 లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వేలాది పాఠశాలల్లో విద్యుత్, మరుగుదొడ్ల సదుపాయాలు లేవని ఆరోపించింది. జనాభా పెరిగినా 1929 నుంచి అమెరికాలో ఎంపీల సంఖ్య పెంచలేదని పేర్కొంది. మరోవైపు, యూపీ, బీహార్ నుంచి వెళ్లే రైళ్లలో రద్దీ పెరుగుతున్నప్పటికీ కొత్త రైలు సర్వీసులు అందుబాటులోకి రావడం లేదని ఆప్ విమర్శించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!