27, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో ప్రకృతి కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్

Writer: Shivani K 03:47 PM, 27 అక్టోబర్, 2026
తెలంగాణలో ప్రకృతి కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్మల్ జిల్లాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ తెలంగాణలో పంటలు ఎండిపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటార్లు ఆన్ చేసి ఉంటే రైతులకు సాగునీరు అందేదని, కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను నడపకపోవడంతో గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శించారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే రాజకీయ కారణాలతోనే ప్రభుత్వం సాగునీటి విషయంలో నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.

గోదావరి నుంచి 750 టీఎంసీలు, కృష్ణా నది నుంచి 250 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని కేటీఆర్ అన్నారు. వాతావరణ హెచ్చరికలు ముందుగానే ఉన్నప్పటికీ నీటి నిల్వలను పెంచుకునేందుకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. రైతుబంధు, విద్యుత్ సరఫరా, యూరియా, సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నీటిని వ్యవసాయానికి వినియోగిస్తుండగా, తెలంగాణలో నదుల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తోందని ఆరోపించారు. రాజకీయ విమర్శలను పక్కనపెట్టి సాగునీటి ప్రాజెక్టుల పంపులను వెంటనే ప్రారంభించి రైతుల పంటలను కాపాడాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేషన్ డీలర్ల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు

రేషన్ డీలర్ల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు

అమిత్ షా పాదయాత్రపై అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా పాదయాత్రపై అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు

యూపీ ఎన్నికల్లో ఒవైసీ పోటీ చేస్తే యోగికి లాభం కావొచ్చు: రామ్‌దేవ్‌

యూపీ ఎన్నికల్లో ఒవైసీ పోటీ చేస్తే యోగికి లాభం కావొచ్చు: రామ్‌దేవ్‌

రేపల్లెలో జోరుగా వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం

రేపల్లెలో జోరుగా వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం

క్షేత్రస్థాయి ఒత్తిళ్లను అధిగమించి సీట్ల సర్దుబాటు: పవన్ కళ్యాణ్
ట్యాగ్లు
కేటీఆర్బీఆర్ఎస్రేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలుతెలంగాణ కరువురైతుల సమస్యలుసాగునీటి ప్రాజెక్టులుకాళేశ్వరం ప్రాజెక్టుపాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతెలంగాణ వ్యవసాయం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

క్షేత్రస్థాయి ఒత్తిళ్లను అధిగమించి సీట్ల సర్దుబాటు: పవన్ కళ్యాణ్

ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కుర్తీ ఆర్డర్ చేస్తే భారీ సైబర్ స్కామ్ బయటపడింది
జనరల్

కుర్తీ ఆర్డర్ చేస్తే భారీ సైబర్ స్కామ్ బయటపడింది

యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ‘బేపర్వా’ ఫస్ట్ లుక్ విడుదల!
సినిమాలు

యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ‘బేపర్వా’ ఫస్ట్ లుక్ విడుదల!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
జనరల్

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఔషధాల ధరల వ్యత్యాసంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
జనరల్

ఔషధాల ధరల వ్యత్యాసంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు షాక్.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర పెంపు
బిజినెస్

వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు షాక్.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర పెంపు

 అక్కడ ‘బాహుబలి 2’ రికార్డు సమం చేసిన ‘జైలర్ 2’..
సినిమాలు

అక్కడ ‘బాహుబలి 2’ రికార్డు సమం చేసిన ‘జైలర్ 2’..

బిగ్‌బాస్‌ తెలుగు 10: 8వ వారం నామినేషన్లలో ముకేష్‌ రచ్చ.. శివ్‌, దేబ్జానీతో వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: 8వ వారం నామినేషన్లలో ముకేష్‌ రచ్చ.. శివ్‌, దేబ్జానీతో వాగ్వాదం

దేవరకద్రలో ఎండిన వరి పంటల పరిశీలన..
రాజకీయాలు

దేవరకద్రలో ఎండిన వరి పంటల పరిశీలన..

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
రాజకీయాలు

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

ఈసీఐ పనితీరుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
జనరల్

ఈసీఐ పనితీరుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయల్ టాటా సవాలు
బిజినెస్

చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయల్ టాటా సవాలు

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు మా లక్ష్యం.. మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌నే: మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు మా లక్ష్యం.. మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌నే: మహేష్ కుమార్ గౌడ్