
జనరల్

పోలీస్ నియామక మండలి వద్ద తమ డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు వ్యవహరించిన తీరును బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు.
ఎన్నికల సమయంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయలేదని హరీశ్ రావు ఆరోపించారు. అరెస్టు చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 వేల పోలీస్ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!