

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా.. ప్రస్తుత సీజన్‌లో రోహిత్ నాయుడు చుట్టూ నెలకొన్న వివాదంపై ఘాటుగా స్పందించారు. రోహిత్, చరణ్ మధ్య జరిగిన సంభాషణ సందర్భంగా రోహిత్ అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించినట్లు, కొన్ని సైగలు చేసినట్లు ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. ఆ సైగలు, వ్యాఖ్యలు బిగ్ బాస్‌ను ఉద్దేశించి చేసినవేనని కొందరు ప్రేక్షకులు భావిస్తుండగా.. రోహిత్ అభిమానులు మాత్రం ఆయన చరణ్‌ను ఉద్దేశించే మాట్లాడారని చెబుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో రోహిత్ ప్రవర్తన, బిగ్ బాస్ షో పట్ల ఆయన వైఖరిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వివాదంపై రోహిత్ పేరును నేరుగా ప్రస్తావించకుండా కౌశల్ మండా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షోకు, తాము ఆడుతున్న ఆటకు కంటెస్టెంట్లు గౌరవం ఇవ్వాలని అన్నారు. సాధారణంగా ప్రశాంతంగా ఉండే నాగార్జున్ గారికే కోపం వచ్చేంతగా పరిస్థితి మారిందని కౌశల్ వ్యాఖ్యానించారు. బిగ్ బాస్ అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, ప్రేక్షకుల ద్వారా లభించే ఒక పెద్ద వేదిక అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కౌశల్ వ్యాఖ్యలపై రోహిత్ అభిమానులు కూడా స్పందిస్తున్నారు. కౌశల్ ఘటనను సరిగ్గా అర్థం చేసుకోలేదని, రోహిత్ బిగ్ బాస్‌ను ఉద్దేశించి మాట్లాడలేదని వారు వాదిస్తున్నారు. దీంతో రోహిత్ వ్యవహారంపై బిగ్ బాస్ ప్రేక్షకుల్లో చర్చ కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!