

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 74వ రోజు డిక్టేటర్స్ గేమ్స్ ఆసక్తికరంగా కొనసాగాయి. డిక్టేటర్స్‌గా వ్యవహరిస్తున్న త్రిగుణ్, ముకేశ్‌ల జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ గేమ్స్‌లో త్రిగుణ్ టీమ్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత జరిగిన ఒక టాస్క్‌లో త్రిగుణ్ టీమ్ తరఫున వంశీ, ముకేశ్ టీమ్ తరఫున ఆర్కే పాల్గొన్నారు. ఈ గేమ్‌కు వర్షిణి, శివ సంచాలకులుగా వ్యవహరించారు. టాస్క్‌లో ఇద్దరూ తీవ్రంగా శ్రమించినప్పటికీ, ఫలితంపై వారి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. డిక్టేటర్స్ మధ్య కూడా ఏకాభిప్రాయం రాకపోవడంతో బిగ్‌బాస్ ఆ గేమ్‌ను రద్దు చేశారు. దీంతో వంశీ, ఆర్కే చేసిన కష్టమంతా వృథా అయింది.
గేమ్ రద్దు తర్వాత బిగ్ బాస్ సూచన మేరకు ముకేశ్ తన టీమ్‌లోని బలమైన, బలహీనమైన కంటెస్టెంట్లను ప్రకటించాడు. రామ్ ప్రసాద్‌ను వీకెస్ట్‌గా, నరేశ్‌ను వీక్‌గా, వర్షిణిని స్ట్రాంగ్‌గా, అమన్‌ను స్ట్రాంగెస్ట్‌గా పేర్కొన్నాడు. మరోవైపు త్రిగుణ్ తన టీమ్‌లో శివను స్ట్రాంగెస్ట్‌గా, దేబ్జానీని స్ట్రాంగ్‌గా, నీతూని వీక్‌గా, వంశీని వీకెస్ట్‌గా గుర్తించాడు. అప్పటికే పోటీలో త్రిగుణ్ టీమ్ ముందంజలో ఉండటంతో బిగ్ బాస్ అతడికి ప్రత్యేక అడ్వాంటేజ్ ఇచ్చారు. తన టీమ్‌లోని ఒకరిని ముకేశ్ టీమ్‌లోకి పంపించి, అక్కడి నుంచి మరొకరిని తన టీమ్‌లోకి తీసుకునే అవకాశం కల్పించారు. దీంతో త్రిగుణ్ నీతూని ముకేశ్ టీమ్‌లోకి పంపించి, అమన్‌ను తన టీమ్‌లోకి తీసుకున్నాడు.
ఇదిలా ఉండగా, వర్షిణిని స్ట్రాంగ్ ప్లేయర్‌గా ముకేశ్ ప్రకటించడంపై నరేశ్ సరదాగా సెటైర్లు వేశాడు. రామ్ ప్రసాద్, దేబ్జానీలతో మాట్లాడుతూ.. వర్షిణి ఒక్కసారిగా అంత స్ట్రాంగ్ ప్లేయర్ ఎలా అయిందంటూ ప్రశ్నించాడు. దీంతో అక్కడున్న హౌస్‌మేట్స్ అందరూ నవ్వుకున్నారు. అనంతరం మరో టాస్క్ నిర్వహించారు. ఇందులో త్రిగుణ్ టీమ్ తరఫున అమన్, దేబ్జానీ, ముకేశ్ టీమ్ తరఫున వర్షిణి, రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ పోటీలో త్రిగుణ్ టీమ్ విజయం సాధించింది. దీంతో 74వ రోజు డిక్టేటర్స్ గేమ్స్‌లో త్రిగుణ్ జట్టు తన ఆధిపత్యాన్ని మరింత చాటుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!