

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో తొమ్మిదో వారం ఆటలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈ వారం ‘రివార్డ్ అండ్ రివేంజ్’ థీమ్‌తో నిర్వహిస్తున్న టాస్క్‌లు హౌస్‌లో కొత్త వివాదాలకు తెరతీస్తున్నాయి. రాబోయే ఫ్యామిలీ వీక్‌లో కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం దక్కించుకోవాలంటే ఈ వారం ఆటల్లో గెలవాల్సి ఉండటంతో కంటెస్టెంట్లు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఈ క్రమంలో గతంలో స్నేహంగా ఉన్నవారి మధ్య కూడా విభేదాలు బయటపడుతున్నాయి.
ఈ వారం నిర్వహించిన తొలి ఛాలెంజ్‌లో ముకేష్ టీమ్ విజయం సాధించింది. ఆ టీమ్ నుంచి శ్వేతకు రివార్డ్ లభించింది. అయితే, టాస్క్‌కు సంచాలకులుగా వ్యవహరించిన త్రిగుణ్, ముకేష్ మధ్య నిర్ణయాల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇద్దరూ వేర్వేరు నిర్ణయాలు ప్రకటించడంతో బిగ్‌బాస్ జోక్యం చేసుకుని హెచ్చరించాల్సి వచ్చింది. అనంతరం బస్తాలు, థర్మకోల్‌తో ‘8’ ఆకారంలో మరో ఛాలెంజ్ నిర్వహించారు. ఈ టాస్క్‌లో కంటెస్టెంట్లు తమ బ్యాగులను కాపాడుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నించారు.
రెండో టాస్క్ సమయంలో సుధీర్, ముకేష్ మధ్య వివాదం మొదలైంది. గత కొంతకాలంగా ముకేష్, వర్షిణి బృందానికి సుధీర్ దూరంగా ఉంటున్నాడు. నామినేషన్ల సమయంలో ముకేష్ చేసిన వ్యాఖ్యలు, వర్షిణి ప్రవర్తనపై సుధీర్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా టాస్క్‌లో ముకేష్ బ్యాగ్‌లో వస్తువులు తగ్గిపోవడాన్ని గమనించిన సుధీర్.. అతడు ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఉందంటూ అమన్‌తో వ్యాఖ్యానించాడు. ఈ మాటలు విన్న ముకేష్ ఆగ్రహంతో సుధీర్ బ్యాగ్‌ను లాగేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ముకేష్ తనకు గతంలో చేసిన సహాయాన్ని ప్రస్తావించడంపై సుధీర్ తీవ్రంగా స్పందించాడు. “ఊరికే సాయం చేసి.. మళ్లీ నీ వల్లే ఇక్కడ ఉన్నావని అనడం ఏంటి? నువ్వు ఇచ్చిన అధికారంతో నేను ఇక్కడ ఉండాలా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా తన మైక్, బ్యాగ్‌ను కింద పడేశాడు. తనకు ఎవరి సాయం అవసరం లేదని, ప్రేక్షకులకు తన ఆట నచ్చకపోతే నేరుగా ఎలిమినేట్ చేయాలని కోరాడు. సుధీర్ ఆవేశంతో చేసిన ఈ వ్యాఖ్యలు హౌస్‌లో కలకలం రేపాయి.
ముకేష్తో వివాదం ముగియకముందే సుధీర్‌కు అమన్తోనూ గొడవ జరిగింది. అమన్ కారణంగా టాస్క్ నుంచి డిస్క్వాలిఫై అయిన సుధీర్.. అతడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు, సుధీర్ తన టార్గెట్‌లో ఉంటాడని అమన్ కూడా ఘాటుగా బదులిచ్చాడు. ఈ ఛాలెంజ్‌లో వంశీ విజయం సాధించాడు. ఇక ఈ వారం కెప్టెన్ త్రిగుణ్, ఆర్కే, శ్వేత మినహా మిగిలిన హౌస్మేట్స్ అందరూ నామినేషన్లలోకి వచ్చారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే ముకేష్ బృందంతో విభేదాలు ఎదుర్కొంటున్న సుధీర్‌తో పాటు వర్షిణి కూడా ఈ వారం డేంజర్ జోన్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!