

బిగ్‌బాస్ తెలుగు 10 తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య వాడీవేడిగా వాదనలు జరిగాయి. హోటల్ టాస్క్‌లో డబ్బుల వ్యవహారంపై వర్షిణి నరేష్‌ను టార్గెట్ చేసింది. ఝాన్సీ డబ్బులు అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. దేబ్జానీ చెప్పిన కారణంగానే నరేష్ డబ్బులు ఇవ్వలేదని ఆరోపించింది. దీనికి నరేష్ గట్టిగా బదులిస్తూ, డబ్బులు తనవని, వాటిని ఎలా ఖర్చు చేయాలనేది తన ఇష్టమని స్పష్టం చేశాడు. అదే విషయాన్ని పదేపదే ప్రస్తావించడంపై అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత రామ్ ప్రసాద్ వర్షిణిని నామినేట్ చేస్తూ, బయటకు స్నేహంగా ఉంటూ లోపల మరోలా వ్యవహరిస్తోందని ఆరోపించాడు. తన అవసరాల కోసం నరేష్‌ను ఉపయోగించుకుందని విమర్శించాడు. టాస్క్‌లో ఇద్దరూ పరస్పరం సహాయం చేసుకున్నప్పుడు ఒకరిని మరొకరు ఉపయోగించుకున్నారని అనడం సరికాదని ప్రశ్నించాడు.
మరోవైపు ముకేశ్ గౌడ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా నామినేషన్లలో చర్చకు వచ్చాయి. దేబ్జానీ గురించి ముకేశ్ చేసిన వ్యాఖ్యలపై శివ తీవ్రంగా స్పందించాడు. ఒక మహిళ గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ, గేమ్‌లో మూడు స్టార్ల కోసం ఇంతలా దిగజారాలా అని నిలదీశాడు. త్రిగుణ్ కూడా ముకేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఝాన్సీ (రైతుబిడ్డ) అన్యాయంగా హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి ముకేశే కారణమని ఆరోపించాడు. దేబ్జానీ సైతం ముకేశ్ ప్రవర్తనను తప్పుబట్టింది. టాస్కుల్లో వేగం, బ్యాలెన్స్ కంటే వ్యక్తిత్వం, ప్రవర్తనే ముఖ్యమని చెబుతూ అతడిని నామినేట్ చేసింది. ముకేశ్ వ్యాఖ్యల వల్ల తాను బాధపడ్డానని పేర్కొంది. దీంతో తొమ్మిదో వారం నామినేషన్ల ఎపిసోడ్‌లో మరోసారి హౌస్ వాతావరణం వేడెక్కింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!