
టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్‌లోని 659 మండల ప్రజా పరిషత్‌లలో (ఎంపీపీ) 601 చోట్ల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇంకా 58 మండలాల్లో ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మండలాల్లో రేపు ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో 33 మండలాల్లో అధ్యక్ష పదవులకు, 58 మండలాల్లో ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
పెండింగ్‌లో ఉన్న 58 మండలాల్లో ఇప్పటికే 25 చోట్ల అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి. ఆయా మండలాల్లో ఉపాధ్యక్ష ఎన్నికలు మాత్రమే నిర్వహించాల్సి ఉంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో అన్ని మండలాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మిగిలిన మండలాల్లో రేపు ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!