

బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్‌లో ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు మిడ్ వీక్‌లో ఎలిమినేట్ అయ్యారు. మూడో రోజు చరణ్, నాలుగో రోజు చైత్రలను టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యుల నిర్ణయంతో బయటకు పంపించారు. సాధారణంగా ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఎలిమినేషన్ జరిగే నేపథ్యంలో, ఇంటి సభ్యులకే ఎలిమినేషన్ అధికారం ఇవ్వడంపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇంటి నుంచి కంటెస్టెంట్‌ను బయటకు పంపేది ప్రేక్షకుల ఓట్లేనని నాగార్జున చెప్పిన విషయాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు.
అయితే చరణ్, చైత్రల మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ట్విస్ట్ ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. టాస్క్ ద్వారా గెలిచిన వారిని మళ్లీ హౌస్‌లోకి పంపడం లేదా ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగానే ఎలిమినేషన్ ఉంటుందని స్పష్టం చేస్తూ వారిని తిరిగి తీసుకురావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ వారం సాధారణ ఓటింగ్ ప్రక్రియలో నటుడు కృష్ణుడు ఎలిమినేట్ అయ్యాడనే తాజా టాక్ బయటకు వచ్చింది. హౌస్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, త్రిగుణ్ ప్రభావానికి లోనై తరచూ రోహిత్‌ను టార్గెట్ చేయడం, ఇతర విషయాల్లో అనవసరంగా సీరియస్ కావడం అతని ఆటపై ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!