

రైళ్లలో ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రైల్వే బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రైలు కోచ్‌లలోని మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ఛార్జింగ్ పాయింట్లను స్విచ్ఛాఫ్ చేయాలని అన్ని రైల్వే జోన్లను ఆదేశించింది. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇటీవల ముంబయి లోకల్ రైలులో ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ పేలిపోవడంతో కోచ్ అంతటా దట్టమైన పొగ వ్యాపించినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో రాత్రి వేళల్లో ఛార్జింగ్ పాయింట్లను నిలిపివేసే నిబంధనను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించింది.
రాత్రి సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉండటం వల్ల విద్యుత్ పరికరాలు వేడెక్కడం, షార్ట్ సర్క్యూట్ వంటి సమస్యలను వెంటనే గుర్తించడం కష్టమవుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. దీంతో అగ్నిప్రమాదాల ప్రమాదాన్ని తగ్గించేందుకు ఈ ముందస్తు చర్యలు చేపట్టారు. నిబంధనల అమలును పరిశీలించేందుకు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రైల్వే బోర్డు ఆదేశించింది. భద్రతా చర్యల అమలులో నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించింది. రైళ్లలో రాత్రిపూట ఛార్జింగ్‌పై ఆంక్షలు 2014లోనే ప్రవేశపెట్టినప్పటికీ, తాజా ఘటన నేపథ్యంలో వాటిని మరింత సమర్థంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!