

మూసీ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకుని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాజేంద్రనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు బీఆర్‌ఎస్ విడుదల చేసిన మీడియా నోట్‌లో పేర్కొంది. దాసోజు శ్రవణ్‌తో పాటు కురువ విజయ్, సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్, తోట్ల స్వామి, షేక్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్, ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు ఈ బృందంలో ఉన్నట్లు తెలిపింది.
మూసీ ప్రక్షాళన, ప్రభావిత కుటుంబాల పునరావాసం వంటి అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమానికి వెళ్తున్న నాయకులను అడ్డుకోవడంపై బీఆర్‌ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి అత్యంత ప్రాధాన్యం ఉందని పేర్కొంటూ, మూసీ ప్రాజెక్టుతో ప్రభావితమయ్యే ప్రజల సమస్యలు, ఆందోళనలు, అభిప్రాయాలను ప్రభుత్వం స్వేచ్ఛగా వినాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించి, ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని బీఆర్‌ఎస్ తన మీడియా నోట్‌లో కోరింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!