
సినిమాలు

బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని 10వ సీజన్‌కు సిద్ధమవుతోంది. అగ్నిపరీక్ష ద్వారా కామనర్లను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతుండగా, కొత్త సీజన్‌లో పాల్గొనే సెలబ్రిటీల పేర్లపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో టాలీవుడ్ నటి సీరత్ కపూర్ బిగ్ బాస్ తెలుగు 10లో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారం పెరగడంతో సీరత్ కపూర్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను బిగ్ బాస్ తెలుగు 10లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.
తాను ఏదైనా అధికారికంగా ప్రకటించాలనుకుంటే తన సోషల్ మీడియా ఖాతాల ద్వారానే వెల్లడిస్తానని సీరత్ తెలిపారు. అప్పటి వరకు ఎలాంటి వదంతులను నమ్మవద్దని అభిమానులను కోరారు. దీంతో ఆమె బిగ్ బాస్ ఎంట్రీపై వస్తున్న ప్రచారానికి తెరపడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!