

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ గ్రాండ్ ప్రీమియర్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో కంటెస్టెంట్లపై ఆసక్తి పెరుగుతోంది. ‘అగ్నిపరీక్ష 2’ ద్వారా ఎంపికవుతున్న కామన్ కంటెస్టెంట్లతో పాటు ఈసారి షోలో అడుగుపెట్టే సెలబ్రిటీల జాబితాపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో నటి సీరత్ కపూర్ పేరు కూడా వినిపించింది. అయితే తాను ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 10లో పాల్గొనడం లేదని సీరత్ స్పష్టం చేశారు.
తనపై వస్తున్న ఊహాగానాలకు స్పందించిన సీరత్.. భవిష్యత్తులో ఏదైనా ప్రకటించాల్సి వస్తే స్వయంగా వెల్లడిస్తానని తెలిపారు. వదంతులను నమ్మవద్దని కోరుతూ అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ‘రన్ రాజా రన్’, ‘ఒక్క క్షణం’, ‘మనమే’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సీరత్ కపూర్.. ప్రస్తుతం బిగ్‌బాస్ 10లో కనిపించబోరని క్లారిటీ ఇచ్చారు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ సీజన్ సెప్టెంబర్ 6న గ్రాండ్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!