

ప్రముఖ కామెడీ షో ‘జబర్దస్త్’ తాజా ప్రోమోలో ఆటో రామ్ ప్రసాద్, పొట్టి నరేష్ కనిపించకపోవడం చర్చకు దారితీసింది. వీరిద్దరూ ‘బిగ్‌బాస్ తెలుగు 10’లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ కొత్త సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
సాధారణంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే సెలబ్రిటీలు షో ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తమ ఇతర ప్రాజెక్టుల షూటింగ్స్‌కు విరామం ఇస్తుంటారు. రామ్ ప్రసాద్, నరేష్ జబర్దస్త్ షూటింగ్‌కు దూరంగా ఉండటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అయితే వీరిద్దరి బిగ్‌బాస్ ఎంట్రీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
గతంలో ముక్కు అవినాష్, రోహిణి, ఇమ్మాన్యుయేల్, ఫైమా వంటి జబర్దస్త్ కమెడియన్లు బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేశారు. రామ్ ప్రసాద్ తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో, పొట్టి నరేష్ తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరిద్దరూ బిగ్‌బాస్ 10లోకి వస్తే షోలో వినోదం మరింత పెరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!