

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 చివరి దశకు చేరుకుంటోంది. ఫినాలే సమీపిస్తుండటంతో హౌస్‌లో ఎలిమినేషన్లు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో పన్నెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే శనివారం ప్రసారమైన వీకెండ్ ఎపిసోడ్‌లో టాలీవుడ్ నటుడు టెంపర్ వంశీ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఈ వారం నామినేషన్స్‌లో త్రిగుణ్, ముఖేష్ గౌడ, ఆటో రామ్ ప్రసాద్, దేబ్జానీ, రామకృష్ణ, టెంపర్ వంశీ, వర్షిణి ఉన్నారు. ఓటింగ్‌లో త్రిగుణ్, ముఖేష్ గౌడ ముందంజలో ఉండగా, వంశీ, వర్షిణి డేంజర్ జోన్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. తక్కువ ఓట్లు రావడంతో వంశీ హౌస్‌ను వీడినట్లు తెలుస్తోంది. వర్షిణి కూడా ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
విలన్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన టెంపర్ వంశీ, పెద్దగా అంచనాలు లేకుండానే బిగ్ బాస్ పదో సీజన్‌లోకి అడుగుపెట్టారు. తనదైన శైలిలో ఆట కొనసాగిస్తూ 12 వారాల పాటు హౌస్‌లో నిలిచారు. ఎలిమినేషన్ అనంతరం తన జర్నీ వీడియోను చూసి ఆనందించిన ఆయన, టైటిల్ గెలవాలని త్రిగుణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక వంశీ పారితోషికం విషయానికి వస్తే, ఆయన వారానికి రూ.2 లక్షలు అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన 12 వారాలకు కలిపి మొత్తం రూ.24 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ పారితోషికానికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ లేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!