
జనరల్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు పరస్పరం గొడవపడినట్లు చూపిస్తున్న ఒక ఏఐ-జనరేటెడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దూసుకెళ్లినట్లు కనిపిస్తున్నప్పటికీ, వాస్తవానికి మ్యాచ్‌లో అలాంటి ఘటన ఏదీ జరగలేదు. ఈ వీడియో పూర్తిగా ఏఐ సాయంతో రూపొందించినదిగా గుర్తించారు.
మ్యాచ్ మాత్రం ఎలాంటి వివాదాలు లేకుండా ముగిసింది. గత మ్యాచ్‌ల మాదిరిగానే ఈసారి కూడా ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోలేదు. ఈ హై-వోల్టేజ్ పోరును వీక్షించేందుకు 18 వేల మందికిపైగా ప్రేక్షకులు హాజరుకాగా, మహిళల ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచ్‌లలో ఇది రికార్డు హాజరుగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 170/6 స్కోరు నమోదు చేయగా, పాకిస్థాన్ జట్టు 106 పరుగులకే ఆలౌటై 64 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!