

అక్కినేని హీరో సుమంత్ తన కొత్త చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’ ప్రమోషన్ల సందర్భంగా వైఎస్ జగన్‌తో తనకున్న స్నేహం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తామిద్దరూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్)లో చదివామని, జగన్ తనకంటే రెండేళ్లు సీనియర్ అయినప్పటికీ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేదని చెప్పారు. కలిసి సినిమాలు, రెస్టారెంట్లకు వెళ్లేవాళ్లమని, పాఠశాల కార్యక్రమాల్లోనూ పాల్గొనేవాళ్లమని గుర్తుచేశారు.
జగన్ చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి అని, స్కూల్ హౌస్ కెప్టెన్‌గా కూడా పనిచేశారని సుమంత్ తెలిపారు. తాము చదివే రోజుల్లోనే జగన్ రాజకీయాల్లోకి, తాను సినిమాల్లోకి వెళ్తామని స్నేహితులు ఊహించారని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేసిన సుమంత్, జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒకసారి కలిశానని, సీఎం అయిన తర్వాత కలిసే అవకాశం రాలేదని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!