
సినిమాలు

రాబోయే ఫ్రీడమ్ సేల్ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ సేవను ప్రారంభించింది. పేయూ ఫైనాన్స్ భాగస్వామ్యంతో అందుబాటులోకి వచ్చిన ఈ సేవ ద్వారా కస్టమర్లు వస్తువులను వెంటనే కొనుగోలు చేసి, తర్వాత చెల్లింపు చేయవచ్చు లేదా సులభ ఈఎంఐలను ఎంచుకోవచ్చు. ఈ సదుపాయం ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మింత్రా, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ సేవలో పే లేటర్, పే ఇన్ 3, ఈఎంఐ అనే మూడు చెల్లింపు ఎంపికలు ఉన్నాయి. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, గ్రాసరీ వంటి పలు విభాగాల్లో ఈ సదుపాయం వర్తిస్తుంది. ఇదిలా ఉండగా, ఆగస్టు 8 నుంచి ఫ్రీడమ్ సేల్ ప్రారంభం కానుండగా, ఎస్‌బీఐ కార్డులపై 10 శాతం వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ లేదా డిస్కౌంట్‌తో పాటు పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!