

భారత క్యూయిస్ట్ అనుపమ రామచంద్రన్ ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో మరోసారి సత్తా చాటింది. మహిళల విభాగంలో వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో హాంకాంగ్‌కు చెందిన సొ మాన్ యాన్‌పై 3-1తో విజయం సాధించింది. తొలి ఫ్రేమ్‌లో ఓటమి ఎదురైనా, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న అనుపమ వరుసగా మూడు ఫ్రేమ్‌లు గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది.
ఈ విజయంతో ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్ మహిళల విభాగంలో వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా అనుపమ రికార్డు సృష్టించింది. అంతకుముందు సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌కు చెందిన టెసా డేవిడ్‌సన్‌ను 3-1తో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు పురుషుల విభాగంలో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అడ్వాణీకి నిరాశ ఎదురైంది. సెమీఫైనల్లో ఇరాన్‌కు చెందిన అలీ గరాహ్‌గోజ్‌లూ చేతిలో 3-5తో ఓడిపోయాడు. అనంతరం జరిగిన ఫైనల్లో అలీ 5-1తో హాంకాంగ్ చైనాకు చెందిన తామ్ యున్ ఫంగ్‌ను ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!