

ఎనిమిదేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన శాండ్‌పేపర్ గేట్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఉస్మాన్ ఖవాజా చేసిన తాజా వ్యాఖ్యలను ప్రస్తుత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఖండించడంతో ఈ అంశంపై చర్చ మొదలైంది. మరోవైపు మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఖవాజాకు మద్దతుగా నిలిచాడు. ఈ పరిణామాలు కమిన్స్ కెప్టెన్సీపై ప్రభావం చూపుతాయా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే, కెప్టెన్సీ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. బాల్ టాంపరింగ్ వివాదంపై మరోసారి విచారణ చేపడతామని ప్రకటించింది.
తాజాగా ఈ వివాదంపై స్పందించిన మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్.. ఇంకా సమాధానాలు లభించని ప్రశ్నలు చాలా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. క్రికెట్ ఆస్ట్రేలియా లేదా స్వతంత్ర సంస్థ ఎవరైనా విచారణ చేపట్టినా.. అది పూర్తిగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని సూచించాడు. ప్రస్తుత ఆటగాళ్లతో పాటు అప్పటి వివాదాస్పద సిరీస్‌లో భాగమైన డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా తదితరులందరి వాదనలను వినాలని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పించాలని, లేదంటే క్రికెట్ వ్యవస్థపై నెలకొన్న అపనమ్మకం మరింత పెరుగుతుందని హెడెన్ హెచ్చరించాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!