

ఆసియా క్రీడల షూటింగ్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కమల్‌జీత్, సురుచి సింగ్ జోడీ అద్భుత ప్రదర్శనతో 484.6 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దీంతో భారత్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. దక్షిణ కొరియా రజతం, ఇరాన్ కాంస్యం సాధించాయి. The Federal
మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంశ్ పాటిల్, నీరజ్ కుమార్ 1,762 పాయింట్లతో రజతం సాధించారు. 1,766 పాయింట్లతో చైనా స్వర్ణం గెలిచింది. స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో జోష్న చిన్నప్ప, వేలవన్ సెంథిల్‌కుమార్ 11-3, 11-5తో ఫిలిప్పీన్స్ జోడీని ఓడించి సెమీఫైనల్‌కు చేరడంతో కనీసం కాంస్యం ఖాయమైంది. టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మనుష్ షా, దియా చితాలే కూడా హాంకాంగ్ జోడీపై 3-1తో విజయం సాధించి పతకాన్ని ఖాయం చేసుకున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!