

భారత షూటర్లు అనంత్‌జీత్ సింగ్ నరుకా, పరినాజ్ ధలివాల్ ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించారు. మిక్స్‌డ్ టీమ్ స్కీట్ ఈవెంట్‌లో భారత్‌కు పతకం అందించిన తొలి జోడీగా నిలిచారు. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఈ జంట 44 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు క్వాలిఫికేషన్‌లో 138 పాయింట్లు సాధించి నాలుగు జట్ల ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్‌కు ముందు ఖతార్ జోడీ వైదొలగడంతో భారత్‌కు పతకం ఖాయమైంది. చైనా 52 పాయింట్లతో స్వర్ణం, దక్షిణ కొరియా 51 పాయింట్లతో రజతం సాధించగా.. భారత్‌కు కాంస్యం దక్కింది.
స్కీట్ విభాగంలో భారత్ పోటీ చేసిన మూడు ఈవెంట్లలోనూ పతకాలు సాధించడం విశేషం. పురుషులు, మహిళల స్కీట్ విభాగాల్లోనూ భారత షూటర్లు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. కమల్‌జీత్, బాలకృష్ణ కేదార్‌లింగ్, ఆకాశ్ భరద్వాజ్‌లతో కూడిన భారత జట్టు 1,730 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో పతకాన్ని తృటిలో కోల్పోయింది. ఈ ముగ్గురూ వ్యక్తిగత విభాగాల్లోనూ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!