7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హర్మన్‌ప్రీత్ యుగానికి ముగింపు.. భారత మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయం

Writer: Chandrika 10:57 AM, 7 అక్టోబర్, 2026
హర్మన్‌ప్రీత్ యుగానికి ముగింపు.. భారత మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయం

భారత మహిళల క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత గొప్ప కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. సారథ్య బాధ్యతలను విడిచిపెట్టింది. ఇటీవలే ఆసియా కప్, ఆసియా క్రీడల్లో జట్టును విజేతగా నిలిపిన ఆమె.. వెంటనే కెప్టెన్సీ నుంచి వైదొలిగింది. హర్మన్‌ప్రీత్‌కు 37 ఏళ్లు వచ్చేసిన నేపథ్యంలో ఆమెకు ప్రత్యామ్నాయాన్ని చూడాల్సిన స్థితిలో ఆమే స్వయంగా ఈ బాధ్యతల నుంచి వైదొలగింది. ప్రస్తుత వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన.. సారథ్య బాధ్యతలను అందుకోనుంది. ఇటీవల గువాహటిలో జరిగిన బీసీసీఐ సమీక్ష సమావేశంలో కెప్టెన్సీ మార్పు మీద చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బోర్డు కార్యదర్శి దేవజిత్‌ సైకియా నేతృత్వంలో జరిగిన సమావేశానికి హర్మన్, స్మృతిలతో పాటు ప్రధాన కోచ్‌ అమోల్‌ మజుందార్‌ హాజరయ్యారు. 2028లో టీ20 ప్రపంచకప్, ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని.. హర్మన్‌ స్థానంలోకి కొత్త కెప్టెన్‌ను తీసుకురావాలని బీసీసీఐ భావించినట్లు తెలుస్తోంది.

‘‘అన్ని ఫార్మాట్లలో భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా తప్పుకొంటున్నా. ఇదంత తేలికైన నిర్ణయం కాదు. ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలు, ఘటనలు నాతో పాటు జీవితాంతం కొనసాగుతాయి. నేను నా బాధ్యతలను నిర్వర్తించాను. జట్టు కోసం ఇవ్వాల్సిందంతా ఇచ్చాను. భారత జట్టును నడిపించే అవకాశం దక్కినందుకు కృతజ్ఞురాలిని. ఇందుకు గర్విస్తాను కూడా. ఇప్పుడు పేజీ తిప్పాల్సిన సమయం వచ్చింది. కెప్టెన్‌గా నా అధ్యాయం ముగిసినా.. భారత క్రికెట్‌ పట్ల నా ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆటలో కొనసాగేందుకు సిద్ధం. సారథ్యం ముగిసింది. ప్రయాణం కొనసాగుతుంది’’ అని హర్మన్‌ప్రీత్‌ పేర్కొంది. హర్మన్‌ప్రీత్‌ 5 టెస్టులు, 51 వన్డేలు, 155 టీ20ల్లో జట్టును నడిపించింది. ఆమె సారథ్యంలో గత ఏడాది భారత జట్టు ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుని సంచలనం రేపింది. ఆసియా క్రీడల్లో కూడా జట్టును వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిపింది హర్మన్‌ప్రీత్‌.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..

ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..

భారత మహిళల క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ చెరగని ముద్ర.. జట్టు రూపురేఖలనే మార్చిన కెప్టెన్

భారత మహిళల క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ చెరగని ముద్ర.. జట్టు రూపురేఖలనే మార్చిన కెప్టెన్

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్..

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్..

భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన...

భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన...

హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌

హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌

ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి గట్టి పోటీ

ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి గట్టి పోటీ

ట్యాగ్లు
హర్మన్‌ప్రీత్ కౌర్స్మృతి మంధానభారత మహిళల క్రికెట్మహిళల క్రికెట్బీసీసీఐభారత మహిళల జట్టుహర్మన్‌ప్రీత్ కెప్టెన్సీమహిళల క్రికెట్ కెప్టెన్వన్డే ప్రపంచకప్ఆసియా క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం
జనరల్

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు
రాజకీయాలు

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట
జనరల్

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ ఆయుధ నష్టం.. 81 విమానాలు ధ్వంసం?
జనరల్

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ ఆయుధ నష్టం.. 81 విమానాలు ధ్వంసం?

పెళ్లి సంబంధాలు రావడం లేదంటూ సీఎంకు రైతు వినతి.. వీడియో వైరల్!
జనరల్

పెళ్లి సంబంధాలు రావడం లేదంటూ సీఎంకు రైతు వినతి.. వీడియో వైరల్!

25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పూర్తి చేసుకున్న మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు
జనరల్

25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పూర్తి చేసుకున్న మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు

రాహుల్ పోరాటాన్ని బారికేడ్లు ఆపలేవు - ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

రాహుల్ పోరాటాన్ని బారికేడ్లు ఆపలేవు - ఉత్తమ్ కుమార్ రెడ్డి

కరెంట్ మీటర్‌లో ఎర్ర లైట్ వేగంగా వెలుగుతోందా? కారణం ఇదే కావచ్చు!
జనరల్

కరెంట్ మీటర్‌లో ఎర్ర లైట్ వేగంగా వెలుగుతోందా? కారణం ఇదే కావచ్చు!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో హీటెక్కిన ఐదో వారం నామినేషన్లు..రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్లు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో హీటెక్కిన ఐదో వారం నామినేషన్లు..రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్లు

యూపీలో మందుల ధరల్లో భారీ వ్యత్యాసాలు.. తనిఖీల్లో షాకింగ్ వివరాలు
జనరల్

యూపీలో మందుల ధరల్లో భారీ వ్యత్యాసాలు.. తనిఖీల్లో షాకింగ్ వివరాలు

ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..
క్రీడలు

ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..

భారత మహిళల క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ చెరగని ముద్ర.. జట్టు రూపురేఖలనే మార్చిన కెప్టెన్
క్రీడలు

భారత మహిళల క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ చెరగని ముద్ర.. జట్టు రూపురేఖలనే మార్చిన కెప్టెన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!